: రఘువీరా చర్యతో మంత్రి ప్రత్తిపాటికి కష్టాలు
ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చేసిన చిన్న పని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. రుణమాఫీ జాబితాపై ఏదైనా సమస్య ఉంటే మంత్రి ప్రత్తిపాటికి నేరుగా ఫోన్ చేయాలంటూ ఆయన ఫోన్ నెంబరును రఘువీరా ప్రకటించారు. దీంతో, మంత్రిగారికి రైతుల నుంచి ఫోన్లు రావడం మొదలైంది. ఒక ఫోన్ కాల్ కు సమాధానం చెప్పేలోపే మరో ఫోన్ కాల్ వస్తోందట.