: నరసింహావతారం ఎత్తుతా: కేసీఆర్
తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు అధికారులు కృషి చేయాలని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ పథకం విజయవంతం కావాలంటే తాను నరసింహావతారం ఎత్తక తప్పేలా లేదన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ పథకం సక్సెస్ అయ్యేందుకు నరసింహావతారం ఎత్తుతానని చెప్పారు. తెలంగాణలో ఏ మహిళ కూడా మంచి నీటి కోసం బజారులో నిలబడకూడదని... నీటి కోసం ఏ ఉళ్లో మహిళ రోడ్డెక్కితే ఆ ఊరి సర్పంచ్, ఎంపీటీసీ రాజీనామా చేయాలని అన్నారు. మెదక్ జిల్లా నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ భూముల అమ్మకాలతో వచ్చే రూ. 24 వేల కోట్లతో రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుందామన్నారు. మెదక్ కేంద్రంగా త్వరలోనే జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పారు.