: గుడివాడలో ఏఎన్ఆర్ పురస్కారాల ప్రదానోత్సవం
అక్కినేని నాగేశ్వరరావు పురస్కారాలను కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాలలో ప్రదానం చేశారు. పలు రంగాల్లో ప్రముఖులైన వారికి అక్కినేని కుమారుడు, నటుడు నాగార్జున ఈ అవార్డులను అందజేశారు. క్రీడారంగంలో విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ, సామాజిక సేవారంగంలో వంశీ రామరాజు, విద్యారంగంలో ఎంఎన్ రాజుకు, న్యాయరంగంలో జస్టిస్ ఎన్.పర్వతరావు, సివిల్ సర్వీసుల రంగంలో సంపత్ కుమార్, ఆరోగ్య రంగంలో గోపీచంద్ మన్నం, ఐ.వరప్రసాద్ రెడ్డి, సినిమా రంగంలో కె.రాఘవేంద్రరావులకు ఈ పురస్కారాలను అందజేశారు. అంతకుముందు ఏఎన్ఆర్ కళాశాలలో అక్కినేని విగ్రహాన్ని నాగార్జున ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులు అమల, నాగ సుశీల, అఖిల్, సుశాంత్, మంత్రి కామినేని శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.