: వరుసగా ఐదో రోజు పతనమైన సెన్సెక్స్


బీఎస్ఈ సెన్సెక్స్ వరుసగా ఐదో రోజు నష్టాలను మూటగట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగుతుండటం, భారతీయ కరెన్సీ 13 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడం వంటి అంశాలు మార్కెట్లను 'బేర్'మనేలా చేశాయి. సెన్సెక్స్ 71 పాయింట్లు కోల్పోయి 26,710 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 8,029 వద్ద ముగిశాయి. గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ, వా టెక్ వాబాగ్ లిమిటెడ్, రూరల్ ఎలెక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, అబాన్ ఆఫ్ షోర్ కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. పీఎంసీ ఫిన్ కార్ప్, బీఎఫ్ యుటిలిటీస్ లిమిటెడ్, అజంతా ఫార్మా, అపోలో టైర్స్ కంపెనీల షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News