: సరితపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఏఐబీఏకు లేఖ రాశాం: క్రీడా మంత్రి


బాక్సర్ సరితాదేవిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్యకు ప్రభుత్వం లేఖ రాసిందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో పార్లమెంట్ బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ, తమ వైపు నుంచి సరిత వ్యవహారాన్ని అంతర్జాతీయ ఫోరమ్ తో చర్చిస్తున్నామన్నారు. సస్పెన్షన్ పై ఏఐబీఏ అధ్యక్షుడికి కూడా తాను లేఖ రాశానని చెప్పారు. సరిత విషయంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో పాటు సోనోవాల్ కూడా మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News