: ఏపీ విభజన బిల్లులో సవరణలపై కాంగ్రెస్ స్పందన


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లులో సవరణలపై కాంగ్రెస్ స్పందించింది. బిల్లులో ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారో వివరించాలని ఆ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి కమల్ నాథ్ అన్నారు. బిల్లు ఆమోద సమయంలో పూర్తి మద్దతు తెలిపిన బీజేపీ ఇప్పుడు మార్పులంటూ ఖ్యాతి కోసం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రాజ్యసభ సభ్యుల విభజనలో తలెత్తిన సమస్య, దానివల్ల ఎంపీలాడ్స్ నిధులను ఖర్చు చేయడంలో ప్రతిష్ఠంభన నెలకొన్న సంగతి తెలిసిందే. దాంతో, రాజ్యసభలో నిన్న (మంగళవారం) ఆయా సభ్యుల వాదనను డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ సావధానంగా విన్నారు. అనంతరం సమస్యను పరిష్కరించేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే విభజన బిల్లును సవరించి వారి సమస్యను పరిష్కరించాలనుకుంటున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.

  • Loading...

More Telugu News