: సమయం తక్కువున్నా... అసెంబ్లీలో గళమెత్తుతాం: రోజా


ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా తాను మహిళలకు మద్దతుగా ఉన్నానని... ఈ అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సమస్యలపై మాట్లాడతానని వైకాపా ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేంత వరకు తాము పోరాడతామని చెప్పారు. ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైకాపా సిద్ధంగా ఉందని అన్నారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించి హుదూద్ తుపాను, రాజధాని, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, అంగన్ వాడీ కార్మికుల వేతనాలు తదితర అనేక సమస్యలు ఉన్నాయని... అసెంబ్లీలో వీటన్నింటిపై గళమెత్తుతామని రోజా చెప్పారు. సమావేశాల సమయం తక్కువగా ఉన్నప్పటికీ... అన్ని సమస్యలపై మాట్లాడతామని తెలిపారు.

  • Loading...

More Telugu News