: ఎన్నడూ జరగని విధంగా పుష్కరాలను నిర్వహిస్తాం: తెలంగాణ సీఎస్
బాసర, భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వరంలతో పాటు మరోచోట గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వెల్లడించారు. గతంలో ఎన్నడూ నిర్వహించని రీతిలో పుష్కరాలను నిర్వహిస్తామని చెప్పారు. గోదావరి పుష్కరాలపై ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం రాజీవ్ శర్మ మాట్లాడుతూ, పుష్కరాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. పుష్కరాల ప్రారంభోత్సవానికి శృంగేరి పీఠాధిపతిని ఆహ్వానించామని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.