: టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సాంబశివరావు
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా దొండపాటి సాంబశివరావు బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 1.30 సమయంలో శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పూర్వపు ఈఓ ఎంజీగోపాల్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కాలినడకన తిరుమల చేరుకున్న ఆయన వైకుంఠం-1 నుంచి ఆలయంలోకి ప్రవేశించి వెంకటేశ్వర స్వామివారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.