: జగన్ జైలుకు వెళ్లే రోజు ఎంతో దూరంలో లేదు: వర్ల రామయ్య


వైకాపా అధినేత జగన్ పై టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుపై జగన్ అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మంచి చేస్తున్న ముఖ్యమంత్రికి సహకరించాల్సింది పోయి... అడుగడుగునా అడ్డు తగిలేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతులేని అవినీతికి పాల్పడిన జగన్... జైలుకు పోయే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. ఇప్పటికే జగన్ కు సంబంధించిన పత్రిక, టీవీల ఆస్తులను ఈడీ జప్తు చేసిందని చెప్పారు.

  • Loading...

More Telugu News