: ముగిసిన తొలి రోజు ఆట... టీమిండియా స్కోరు 311/4


బ్రిస్బేన్ లో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఓపెనర్ మురళీ విజయ్ (144) సెంచరీ సాధించగా, వరుసగా రెండో టెస్టులోనూ శిఖర్ ధావన్ (24) నిరాశపరిచాడు. ఛటేశ్వర్ పుజారా(18) తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. తొలి టెస్టులో రెండు సెంచరీలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ (19) రెండో టెస్టులో విఫలమయ్యాడు. అజింక్యా రహానే (75), రోహిత్ శర్మ (26) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఆసీస్ బౌలర్ జోష్ హాజెల్ ఉడ్ రెండు వికెట్లు తీయగా, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్ లు చెరో వికెట్ తీసుకున్నారు.

  • Loading...

More Telugu News