: గూగుల్ ఫాంట్ల జాబితాలో 'ఎన్టీఆర్ ఫాంట్'
నెటిజన్ల కోసం గూగుల్ ఎన్నో ఫాంట్లను అందుబాటులోకి తెచ్చింది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫాంట్లను ప్రవేశపెడుతోంది. తాజాగా, తన జాబితాలో విఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు పేరిట 'ఎన్టీఆర్ ఫాంట్' ను చేర్చింది. అమెరికాలోని తెలుగు సంఘం సిలికానాంధ్ర ఈ ఫాంట్ రూపకర్త. కాగా, గూగుల్ మరికొన్ని ఫాంట్లను కూడా తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇవన్నీ ఉచితంగానే వినియోగించుకోవచ్చు.