: హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ కలకలం... గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు మృతి
ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూ మరోమారు హైదరాబాద్ ను వణికిస్తోంది. ఈ వ్యాధి బారిన పడి ముగ్గురు రోగులు నేడు నగరంలోని గాంధీ ఆసుపత్రిలో మృత్యువాతపడ్డారు. మరణించిన వారిలో ఒకరు జీడిమెట్ల వాసి కాగా, రెండో వ్యక్తిది ఉప్పల్ గా గుర్తించిన వైద్యులు, మూడో వ్యక్తి మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. ఇప్పటికే స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో రోగులు చేరుతున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారిలో మరో ఇద్దరికి ఆ వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు.