: కాలిబాటన తిరుమలకు టీటీడీ కొత్త ఈఓ... నేడు బాధ్యతల స్వీకరణ
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి సాంబశివరావు కొద్దిసేపటి క్రితం కాలిబాటన తిరుమల చేరుకున్నారు. తిరుపతి నుంచి నడకదారిన తిరుమల చేరుకున్న ఆయన వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. వెంకన్న దర్శనానంతరం ఆయన నేడు టీటీడీ ఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన సందర్భంగా టీటీడీ ఈఓగా పనిచేస్తున్న ఎంజీ గోపాల్ స్థానంలో సాంబశివరావును నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నేడు టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు కాలిబాటన తిరుమల చేరుకున్నారు.