: వంశీచంద్ తో ఘర్షణ వ్యవహారంలో విష్ణుకు నోటీసులు
ఈ నెల 12న ఓ పెళ్లి సందర్భంగా ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ వ్యవహారంలో మాదాపూర్ పోలీసులు విష్ణుకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో 37 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం తీసుకున్న అనంతరం... విష్ణు, మరికొందరు వ్యక్తులు వంశీచంద్ పై దాడిచేసినట్టు పోలీసులు గుర్తించారు. అందుకోసం సీసీటీవీ ఫుటేజిని కూడా పరిశీలించారు.