: బాక్సర్ సరితాదేవిపై ఏడాదిపాటు నిషేధం


మహిళా బాక్సర్ సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) ఏడాదిపాటు నిషేధం విధించింది. అంతేగాక, వెయ్యి స్విస్ ఫ్రాంక్ ల జరిమానా కూడా విధించింది. ఆసియా క్రీడల్లో ఆమె పతకం నిరాకరించడాన్ని తీవ్రంగా పరిగణించిన సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది. భారత బాక్సింగ్ విదేశీ కోచ్ బీఐ ఫెర్నాండెజ్ పై రెండేళ్ల నిషేధం విధించారు. అక్టోబర్ లో దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల బాక్సింగ్ సెమీఫైనల్ వివాదాస్పదమైంది. ఇందులో సరిత ప్రత్యర్థి కొరియా బాక్సర్ పార్క్ విజేతగా నిలిచింది. దాంతో, తీవ్ర నిరాశ చెందిన సరిత బహుమతి ప్రదాన సమయంలో తన కాంస్య పతకాన్ని తీసుకునేందుకు నిరాకరించి తీవ్రంగా రోదించింది. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య చర్యలు తీసుకుంది. వచ్చే ఏడాది నవంబర్ లో సరిత తిరిగి అర్హత పొందుతుంది.

  • Loading...

More Telugu News