: కర్ణాటక ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే.. : షిండే
బెంగళూరు వరుస పేలుళ్ళ ప్రభావం కర్ణాటక ఎన్నికలపై ఉండబోదని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే కర్ణాటక ఎన్నికలు జరుగుతాయని షిండే వెల్లడించారు. నిన్న బెంగళూరులో బీజేపీ కార్యాలయం ముందు బాంబు పేలిన ఘటనలో పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో, ఎన్నికల నిర్వహణపై అనుమాన మేఘాలు ముసురుకున్నాయి. ఈ నేపథ్యలో షిండే ప్రకటన అందరి సందేహాలను పటాపంచలు చేసింది.
కాగా, ఉగ్రవాదుల దాడులు జరగవచ్చని ముందే హెచ్చరించామని షిండే పేర్కొన్నారు. అయితే, ఇంకా ఎక్కడెక్కడ దాడులు జరగవచ్చన్న దానిపై తమ వద్ద సమాచారం లేదని హోం మంత్రి చెప్పారు.