: పరిశ్రమలకు అనుమతుల కోసం ‘సింగిల్ డెస్క్’ విధానం: చంద్రబాబు
రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు నెలకొల్పేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ‘సింగిల్ డెస్క్’ పద్ధతిన అనుమతులు మంజూరు చేయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నేడు విశాఖలో పర్యటిస్తున్న చంద్రబాబు, 'ఫార్చ్యూన్ ఇండియా' ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సమావేశంలో కీలకోపన్యాసం చేశారు. గతంలో పరిశ్రమలకు అనుమతుల కోసం సింగిల్ విండో పద్ధతి అమలులో ఉండేదని, తాజాగా 'సింగిల్ డెస్క్' పద్ధతిని ప్రవేశపెడుతున్నామని ఆయన వెల్లడించారు. ఈ విధానం కింద కేవలం 21 రోజుల్లోనే ఆయా పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు.