: బాలచందర్ చనిపోయారంటూ సంతాపం ప్రకటించిన వర్మ... తప్పుదిద్దుకున్న వైనం


వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి కాస్త తొందరపాటు ప్రదర్శించాడు. విఖ్యాత దర్శకుడు బాలచందర్ అస్తమయం అంటూ ట్వీట్ చేసి, సంతాపం కూడా ప్రకటించాడు. ఆనక నాలుక్కరుచుకున్నాడు. అదో పుకారు అని చెబుతూ, తప్పు దిద్దుకున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలచందర్ కోలుకోవాలంటూ మరో ట్వీట్ చేశాడు. పాత ట్వీట్ తొలగించాడు. బతికుండగానే సంతాపం ప్రకటించడం ఏంటంటూ పలువురు వర్మ ట్వీట్ పై కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News