: ఏపీ ప్రభుత్వానికి లోకాయుక్త నోటీసులు
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ను ఎందుకు నిలిపివేశారో చెప్పాలని ఆదేశించింది. విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎందుకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించింది. జనవరి 19లోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి లోకాయుక్త సూచించింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 54 శాతం విద్యుత్ వాటా రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే.