: పవన్ కల్యాణ్ హటావో-పాలిటిక్స్ బచావో... ఈ పుస్తకం వివాదాస్పదంగా మారనుందా?


హైదరాబాదు తార్నాకకు చెందిన బొగ్గుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇటీవల 'పవన్ కల్యాణ్ హటావో-పాలిటిక్స్ బచావో' అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని బుధవారం హైదరాబాదులో ప్రారంభమయ్యే బుక్ ఫెయిర్ లో విక్రయించేందుకు నిర్ణయించారు. అయితే, నటుడు పవన్ కల్యాణ్ నుంచి, ఆయన అభిమానుల నుంచి తనకు ముప్పు ఉందని పుస్తక రచయిత శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై, నాయిని స్పందించారు. శ్రీనివాస్ కు పూర్తి రక్షణ కల్పిస్తామని, పుస్తక విక్రయాలు సజావుగా సాగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రత్యేక బాధ్యతలను డీసీపీ కమలాసన్ రెడ్డికి అప్పగించారు. కాగా, ఈ పుస్తకంలో ఉన్న అంశాలు ఇంకా వెలుగులోకి రాలేదు.

  • Loading...

More Telugu News