: 2029 నాటికి దేశంలోనే ఏపీ అగ్రరాష్ట్రంగా ఎదుగుతుంది: చంద్రబాబు
2029 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రరాష్ట్రంగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కొద్దిసేపటి క్రితం విశాఖకు చేరుకున్న ఆయన అక్కడ 'ఫార్చ్యూన్ ఇండియా' ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వ సహకారంపై ఆయన కీలక ప్రసంగం చేశారు. కేవలం 21 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అవసరమైన అనుమతులన్నీ మంజూరు చేస్తామని చెప్పిన బాబు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. రాష్ట్రంలోని అపార అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలుపుతామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.