: నేడు ఏపీ కేబినెట్ భేటీ... 'అసెంబ్లీ' వ్యూహాలపైనే ప్రధాన చర్చ


ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేటి సాయంత్రం 4 గంటలకు జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రేపు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల అజెండాపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. రైతులకు రుణమాఫీ ప్రకటన, పథకం అమలులో తలెత్తుతున్న ఇబ్బందులు, విపక్షం ఆరోపణలు తదితరాలపై కేబినెట్ దృష్టి సారించనుంది. అంతేగాక, వివిధ అంశాలపై ప్రతిపక్షం సంధించే విమర్శనాస్త్రాలను తిప్పికొట్టే విషయంపైనా ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News