: రెండో టెస్టులో టీమిండియా సెంచరీ... విజయ్ హాఫ్ సెంచరీ


బ్రిస్బేన్ లో నేటి ఉదయం ప్రారంభమైన రెండో టెస్టులో 31 ఓవర్లు దాటేసరికి టీమిండియా స్కోరు వంద మార్కును చేరింది. లంచ్ విరామానికి ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసిన భారత జట్టు, లంచ్ విరామం తర్వాత నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. తనతో పాటు తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన శిఖర్ ధావన్ స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా, ఓపెనర్ మురళీ విజయ్ మాత్రం తొలి టెస్టులో లాగానే నింపాదిగా పరుగులు రాబడుతున్నాడు. మొత్తం 92 బంతులను ఎదుర్కున్న విజయ్ 52 పరుగులతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో అతడికి సహకరిస్తున్న ఛటేశ్వర్ పుజారా 58 బంతులకు గాను కేవలం 18 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News