: నేడు నల్లగొండ, మెదక్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన


తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేడు నల్లగొండ, మెదక్ జిల్లాల్లో పర్యటించనున్నారు. నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించనున్న కేసీఆర్, ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేటి సీఎం సమీక్ష అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. యాదగిరిగుట్ట ఆలయ సమీక్ష అనంతరం అక్కడి నుంచే మెదక్ జిల్లా వెళ్లనున్న కేసీఆర్ పట్టణంలోని ప్రఖ్యాత మెదక్ చర్చిని సందర్శిస్తారు. అనంతరం జిల్లాలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన సమీక్షిస్తారు.

  • Loading...

More Telugu News