: నేడు విశాఖకు చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఫార్చ్యూన్ ఇండియా ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తల సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడంపై కీలక దృష్టి సారించిన చంద్రబాబు నేటి భేటీలోనూ ఇదే అంశంపై కీలక ప్రసంగం చేయనున్నారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు కేవలం 21 రోజుల్లోనే పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అన్ని అనుమతులు ఇవ్వనున్నామన్న విషయాన్ని చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించనున్నారు. అంతేకాక ఆయా పరిశ్రమలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా ఆయన పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు.

  • Loading...

More Telugu News