: నవాజ్ షరీఫ్ కు మోదీ ఫోన్...ఉగ్ర ఘటనకు పాఠశాలల్లో రెండు నిమిషాల మౌనం


పాకిస్థాన్ నగరం పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రవాదుల దాడిని ఖండించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఫోన్ లో మాట్లాడారు. ఘటనపై మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతులకు ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పిన మోదీ, ఉగ్రవాదులపై పోరులో పాక్ కు భారత్ బాసటగా నిలుస్తుందని షరీఫ్ కు హామీ ఇచ్చారు. మరోవైపు పెషావర్ ఉగ్రదాడిలో అసువులుబాసిన వారికి సంతాపం తెలుపుతూ, దేశంలోని అన్ని పాఠశాలలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం భారత్ లోని అన్ని పాఠశాలలు పాక్ లో ఉగ్రదాడికి సంతాపం తెలపనున్నాయి.

  • Loading...

More Telugu News