: రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ
ఢిల్లీలోని ఆర్మీ రీసర్చ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. జమ్మూ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన మోదీ... విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ప్రణబ్ ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. గత నాలుగు రోజులుగా ప్రణబ్ దాదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆంజియోప్లాస్టీ నిర్వహించి, స్టెంట్ ను అమర్చారు.