: తాలిబన్లది పిరికిపందల చర్య: మలాలా
పెషావర్ లోని సైనిక పాఠశాలపై దాడి చేసి 160 మంది ప్రాణాలను బలిగొన్న పాక్ తాలిబన్లపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ మండిపడ్డారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆమె... తాలిబన్లది పిరికిపందల చర్య అని అన్నారు. పిల్లలపై ఇలాంటి చర్యలకు దిగడం అమానుషమని పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడికి తాము భయపడమని అన్నారు.