: పెషావర్ లో ముగిసిన సైనిక చర్య... 160 మందిని చంపిన ఉగ్రవాదులు


పాకిస్థాన్ లోని పెషావర్ లో సైనిక చర్యలు ముగిశాయి. దాదాపు తొమ్మిది గంటలపాటు కొనసాగిన ఆపరేషన్ లో ఆరుగురు ఉగ్రవాదులను పాక్ సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి సంఖ్య 160కి పెరిగిందని... వీరిలో 125 మంది విద్యార్థులున్నారని సైనికాధికారులు వెల్లడించారు. మరో 122 మంది గాయపడ్డారని... వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఒక్కో క్లాస్ రూమ్ తిరుగుతూ, పిల్లలను పిట్టల్లా కాల్చేశారని అధికారులు తెలిపారు. పిల్లలను నిలబెట్టి తలపై కాల్చినట్టు తెలుస్తోందని డాక్టర్లు వెల్లడించారు.

  • Loading...

More Telugu News