: వైకాపాకు గుడ్ బై చెప్పనున్న మరో ఎమ్మెల్యే?


ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వైకాపా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనబడుతోంది. ఈ రోజు టీఎస్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తుమ్మల నాగేశ్వరరావు తనకు రాజకీయ గురువని... ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని వెంకటేశ్వర్లు అన్నారు. దీంతో, వైకాపాలో మరో వికెట్ పడబోతోందనే విషయం స్పష్టమవుతోంది. అయితే నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటానని వెంకటేశ్వర్లు తెలిపారు.

  • Loading...

More Telugu News