: కొండా సురేఖకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్


టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా దొరకలేదనే వార్త రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్న సురేఖకు చివరకు ఆశాభంగమే మిగిలింది. నిన్న ఉదయం ముఖ్యమంత్రి అధికారిక నివాసం వద్ద, అలాగే సచివాలయంలో కేసీఆర్ ను కలిసేందుకు సురేఖ విశ్వప్రయత్నం చేశారట. కేసీఆర్ నివాసంలోని ఆయన ఛాంబర్ కు సురేఖ తలుపు తోసుకుని వెళ్లారని... 'కొంచెం పనిలో ఉన్నా, సచివాలయంలో కలుద్దామని' చెప్పి ఆమెను కేసీఆర్ పంపించి వేశారని సమాచారం. అనంతరం కేసీఆర్ బయటకు వెళ్లిపోయారు. సాయంత్రం సెక్రటేరియట్ కు వెళ్లిన సురేఖకు ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కూడా దొరకలేదు. ఈ సందర్భంలో, ఆమెను కలిసిన మంత్రి హరీష్ రావు... ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రి పదవి ఇవ్వలేరని, ఆమె భర్త కొండా మురళికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పి నచ్చజెప్పడానికి ప్రయత్నించారట. దీంతో, సురేఖ ఆశలమీద నీరు చల్లినట్టైంది.

  • Loading...

More Telugu News