: ఆరో ఉగ్రవాది హతం... మరో 11 మంది స్కూలు సిబ్బందిని కాపాడిన సైన్యం


పెషావర్ లోని సైనిక పాఠశాలలో పాక్ తాలిబన్లు జరిపిన దాడిలో ఇప్పటి వరకు 130 మంది హతమయ్యారు. వీరిలో 125 మంది వరకు విద్యార్థులు చనిపోయినట్టు సమాచారం. ఒక ఉపాధ్యాయుడిని ఉగ్రవాదులు సజీవ దహనం చేశారు. ఉగ్రవాదులకు, పాక్ సైన్యానికి మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, ఆరో ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది. మరో 11 మంది స్కూలు సిబ్బందిని సురక్షితంగా కాపాడామని సైనికాధికారి ఆసిం బజ్వా తెలిపారు. పాఠశాలలో అక్కడక్కడ పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు అమర్చారు. దీంతో, సైనిక చర్యలకు కొంతమేర ఆటంకం ఏర్పడుతోంది.

  • Loading...

More Telugu News