: భారత్ అంతటా హై అలర్ట్... విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం
పాక్ లోని పెషావర్ లో తాలిబన్లు నరమేధం సృష్టించిన నేపథ్యంలో, భారత్ అప్రమత్తం అయింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఈ ఘటనతో ఉగ్రవాదుల అసలు రూపమేమిటో ప్రపంచం మొత్తానికి తెలిసిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. హై అలర్ట్ నేపథ్యంలో, దేశంలోని విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లలో భద్రత పెంచారు. సీఐఎస్ఎఫ్ బలగాలు అలర్ట్ అయ్యాయి. నగరాలు, పట్టణాల్లో నిఘా పెంచాలని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.