: పెషావర్ బాధిత కుటుంబాలకు పరిహారం
పెషావర్ లోని సైనిక పాఠశాలపై తాలిబన్లు జరిపిన దాడిలో చనిపోయిన బాధిత కుటుంబాలకు స్థానిక ఖైబర్ పక్తుంఖ్వా రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చనిపోయిన వారి ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్వేజ్ ఖట్టాక్ తెలిపారు. మరోవైపు సైనిక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.