: అవసరమైతే నన్ను చంపండి: తాలిబన్లకు నోబెల్ విజేత సత్యార్థి విజ్ఞప్తి
పాకిస్థాన్ లో తాలిబన్ల కిరాతకాన్ని నోబెల్ శాంతి బహుమతి విజేత, భారత్ లో బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి ఖండించారు. పెషావర్లో సైనిక పాఠశాల విద్యార్థులపై తాలిబన్లు దాడికి పాల్పడిన ఘటనపై ఆయన మాట్లాడుతూ, కావాలనుకుంటే తనను చంపాలని, పిల్లలను వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది మానవత్వానికి మచ్చ అనదగ్గ చర్య అని విమర్శించారు.