: పాక్ తాలిబన్లు ఎక్కువగా తలలపైనే కాల్చారు


పెషావర్ లోని ఆర్మీ స్కూల్ పై పాక్ తాలిబన్లు జరిపిన దాడిలో ఇప్పటి వరకు 126 మంది చనిపోయినట్టు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. దాడుల సమయంలో కొంత మందిని ఆర్మీ అధికారులు రక్షించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఒళ్లు గగుర్పాటు కలిగించే అంశాలు వెలుగు చూశాయి. విద్యార్థులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఎక్కువగా పిల్లల తలపైనే కాల్చినట్టు వైద్యులు తెలిపారు. ఒక్కొక్కరిని రెండు నుంచి మూడుసార్లు కాలుస్తున్నారని, తన స్నేహితులంతా రక్తపుమడుగులో పడి ఉన్నారని క్షేమంగా బయటపడిన ఓ విద్యార్థి తెలిపాడు. ఓ ఆర్మీ అధికారి వెనుక గేటు నుంచి వచ్చి తమను రక్షించాడని మరో విద్యార్థి చెప్పాడు.

  • Loading...

More Telugu News