: తాలిబన్ల దాడిని ఖండించిన బాలీవుడ్
పాకిస్థాన్ లోని పెషావర్ లో ఉన్న సైనిక పాఠశాలపై పాక్ తాలిబన్లు జరిపిన దాడిలో ఇప్పటి వరకు 126 మంది మృత్యువాత పడ్డారు. ఈ దారుణ ఘటనను బాలీవుడ్ ప్రముఖులు ఖండించారు. కరణ్ జోహార్, వివేక్ ఒబెరాయ్, ప్రియాంక చోప్రా, రవీనా టాండన్, సోఫీ చౌదరి, సోనూ సూద్, మాధవన్ లు ట్లిట్టర్లో స్పందిస్తూ... ఈ ఘటన చాలా దారుణమని, చలించిపోతున్నామని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇది అత్యంత ఘోరమైన చర్య అని నటుడు అర్జున్ కపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉగ్రవాదుల దాడి హృదయాన్ని కలచివేసేలా ఉందని ఫరాన్ అక్తర్ అన్నాడు. ఉగ్రదాడుల్లో ఇంతమంది చిన్నారులు చనిపోవడం అత్యంత బాధాకరమని పాక్ గాయకుడు, నటుడు అలీ జాఫర్ ఆవేదన వ్యక్తం చేశాడు.