: రాష్ట్రపతికి ఆతిథ్యం ఇవ్వలేకపోతున్న హైదరాబాద్
భారత రాష్ట్రపతికి ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఆతిథ్యం ఇచ్చే హైదరాబాద్ ఈ దఫా ఆ భాగ్యానికి దూరం కానుంది. అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నారు. శీతాకాల విడిది అయిన హైదరాబాదులో రాష్ట్రపతి ఏటా ఒక వారం రోజులు గడపడం ఆనవాయతీగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఆ పర్యటన ఈ సారి రద్దయింది. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ ను అధికారులు ఇప్పటికే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.