: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు... 538 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 538 పాయింట్లు పతనమైంది. అక్టోబర్ 28 తర్వాత తొలిసారి సెన్సెక్స్ 27 వేల దిగువకు పడిపోయింది. 13 నెలల కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ పతనమవడం, ద్రవ్యోల్బణం సున్నాకు పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండటం తదితర కారణాలతో మార్కెట్లు కుప్పకూలాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 538 పాయింట్లు కోల్పోయి 26,781కి పడిపోయింది. నిఫ్టీ 152 పాయింట్లు పతనమై 8,068కి దిగజారింది. జెట్ ఎయిర్ వేస్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఐడియా సెల్యులార్ కంపెనీల షేర్లు లాభపడగా... పీఎంసీ ఫిన్ కార్ప్, యూనిటెక్, జైన్ ఇరిగేషన్, పిపావావ్ డిఫెన్స్ సంస్థల షేర్లు నష్టపోయాయి.