: మా బాధ సైనికులకు తెలియాలనే ఈ దాడి: తాలిబాన్ ఉగ్రవాదులు
పాకిస్తాన్ సైనికులు తమ కుటుంబాలను లక్ష్యాలుగా చేసుకుని వేధిస్తున్నారని, అన్యాయంగా ఎంతో మందిని బలి తీసుకున్నారని తాలిబాన్ ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్-పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించింది. తమ ఆప్తులను కోల్పోతే, ఆ బాధ ఎలా ఉంటుందో సైనికులకు తెలియాలనే వారి బిడ్డలు చదువుతున్న పాఠశాలపై దాడి చేశామని తాలిబాన్లు స్పష్టం చేశారు. అయితే, తాము పెద్ద పిల్లలనే లక్ష్యంగా చేసుకోమని తమ వారికి చెప్పినట్టు తాలిబన్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.