: తాలిబన్ల దాడిపై వసీం అక్రమ్ స్పందన
పాకిస్థాన్ లోని పెషావర్లో తాలిబన్లు ఓ పాఠశాలపై దాడి చేసి చిన్నారులను బలిగొనడం ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. దీనిపై మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ స్పందించాడు. ఈ దాడిని ఖండిస్తున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నాడు. తన దేశంలో జరిగిన ఇంతటి భయంకరమైన దాడులకు సంబంధించిన వార్తలు చూస్తున్నానని ట్వీట్ చేశాడు. పెషావర్ ప్రజల కోసం దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నాడు. అక్రమ్ భార్య షనైరా కూడా పెషావర్ ప్రజల క్షేమం కోసం ప్రార్థించాలని పేర్కొంది.