: 'రోహ్ తక్ సిస్టర్స్'కు లై డిటెక్టర్ పరీక్షలు


తమను వేధించాడంటూ ఓ వ్యక్తిని చితకబాది వార్తల్లోకెక్కిన 'రోహ్ తక్ సిస్టర్స్'కు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది. 'రోహ్ తక్ సిస్టర్స్' గా పేరుగాంచిన పూజ, ఆర్తి తాము 2000 మందిని ఇలాగే చితకబాదామని గొప్పగా చెప్పుకోవడంతో వీరి వ్యవహార శైలిపై సందేహాలు తలెత్తాయి. ఈ క్రమంలో కొందరు బాధితులు కూడా వెలుగులోకి వచ్చారు. ఈ అక్కాచెల్లెళ్లు తమను అకారణంగా కొట్టారని, డబ్బులు డిమాండ్ చేశారని వాపోయారు. దీంతో, హర్యానా పోలీసు శాఖ ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిస్టర్స్ కు లై డిటెక్టర్ పరీక్షతో పాటు పాలీగ్రాఫ్ టెస్టు కూడా నిర్వహించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని దర్యాప్తు బృందం కోర్టును కోరింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సదరు అనుమతి మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News