: ఆ నటుడి ఆత్మహత్య గురించే ఎక్కువగా వెతికారట!
ఈ ఏడాది గూగుల్ లో అత్యధికులు సెర్చ్ చేసింది హాలీవుడ్ కమెడియన్ రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య గురించేనట. సాకర్ వరల్డ్ కప్, ఎబోలా మహమ్మారి, మలేసియా విమానం ఎంహెచ్ 370, ఐస్ బకెట్ చాలెంజ్... తదితర అంశాల కంటే విలియమ్స్ బలవన్మరణం గురించే గూగుల్ లో శోధనలు సాగాయి. ఈ మేరకు గూగుల్ ఓ జాబితా విడుదల చేసింది. ఎక్కువ మంది వెదికిన అంశాలతో ఈ జాబితా రూపొందించారు. కొన్ని అమేజింగ్ వీడియోలు కూడా ఈ జాబితాలో చోటు చేసుకున్నాయి. కాగా, విలియమ్స్ ఆత్మహత్య, ఎబోలా వ్యాప్తి, సాకర్ వరల్డ్ కప్, ఐస్ బకెట్ చాలెంజ్ ఇత్యాది అంశాలు ఫేస్ బుక్ లో అత్యధికంగా చర్చించిన అంశాలుగా నిలిచాయి.