: పెషావర్ బయలుదేరిన పాక్ ప్రధాని షరీఫ్
పాకిస్థాన్ లోని ప్రధాన నగరాల్లో ఒకటైన పెషావర్ లో పాక్ తాలిబాన్లు నెత్తుటి ఏరులు పారిస్తున్నారు. స్థానిక ఆర్మీ పాఠశాలపై దాడి చేసిన తాలిబాన్లు ఇప్పటిదాకా 100 మందికి పైగా చిన్నారులను బలిగొన్నారు. ఇంకా ఎంతమందిని చంపేస్తారో కూడా తెలియని పరిస్థితి. పాఠశాలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఇరువైపుల నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హుటాహుటిన పెషావర్ బయలుదేరారు. ఖైబర్ ఫక్తూంక్వాలో మూడు రోజుల సంతాప దినాలను పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటన యావత్ పాకిస్థాన్ ను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.