: 100 మందికి పైగా విద్యార్థులను చంపేశారు: పాక్ హోం శాఖ
పాకిస్థాన్ లోని పెషావర్ లో ఉన్న ఆర్మీ పాఠశాలపై దాడి చేసిన పాక్ తాలిబాన్లు నరమేధం సృష్టిస్తున్నారు. చిన్నారులనే జాలి, కరుణ కూడా లేకుండా పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపేస్తున్నారు. ఇప్పటిదాకా 100 మందికి పైగా విద్యార్థులను హతం చేశారని పాకిస్థాన్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 400 మంది వరకు ఉగ్రవాదుల చెరలో ఉన్నారు. ఉగ్రవాదులకు, పాక్ సైనికులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.