: వేధింపులవల్లే గురజాడ మనవడి ఆత్మహత్య: ఉద్యోగుల ఆరోపణ
ఉన్నతాధికారుల వేధింపులవల్లే గురజాడ అప్పారావు ముని మనవడు, కాకినాడ ఉద్యానవన విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ గురజాడ శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారని ఉద్యోగులు ఆరోపించారు. ప్రధానంగా, ఉద్యానవన శాఖ కమిషనర్ వేధింపులే శ్రీనివాసరావును ఆత్మహత్యకు పురిగొల్పాయని ఉద్యోగులు నిరసన తెలిపారు. కమిషనర్ ను చట్టప్రకారం శిక్షించాలని జాతీయ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హనుమంతరావు డిమాండ్ చేశారు. కమిషనర్ నుంచి రూ.50 లక్షలు వసూలు చేసి బాధిత కుటుంబానికి అందజేయాలని కోరారు. కాగా, శ్రీనివాసరావు మృతదేహానికి విజయనగరంలో నిన్న అంత్యక్రియలు జరగ్గా, పలువురు అధికారులు, సిబ్బంది, గురజాడ అభిమానులు హాజరయ్యారు.