: దీపికా పదుకొనె, నేను డేటింగ్ చేశాం: సిద్ధార్థ్ మాల్యా
బాలీవుడ్ ప్రముఖ కథానాయిక దీపికా పదుకొనె, తాను ఒకానొక సమయంలో డేటింగ్ చేశామని వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా అంగీకరించాడు. అయితే కొన్నాళ్ళకు విడిపోయామని, అయినా, మిత్రులుగానే ఉంటున్నామని ఓ ఇంటర్వ్యూలో సిద్ తెలిపాడు. కెరీర్ మొదట్లో రణబీర్ కపూర్, దీపిక పీకల్లోతు ప్రేమాయణం నడిపారు. తరువాత కొన్ని కారణాలతో బ్రేకప్ చెప్పారు. ఆ తరువాతే మాల్యా కొడుకుతో దీపు డేటింగ్ చేసింది. కొంతకాలానికి ఆ బంధం కూడా తెగిపోగా, అమ్మడు ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ తో ప్రేమలో ఉందని బాలీవుడ్ టాక్.