: సినీనటి జీవితపై మరో నాన్‌ బెయిలబుల్ వారెంట్


సినీనటి జీవితపై మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఇది కూడా చెక్ బౌన్సు కేసే కావడం గమనార్హం. ఓ చెక్ బౌన్స్ కేసును విచారణకు స్వీకరించిన సిటీ సివిల్ కోర్టు నేడు జీవితకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ ను ఆమెకు అందించేందుకు పోలీసులు రాజశేఖర్ ఇంటికి వెళ్ళగా, అక్కడ ఎవరూ లేకపోవడంతో వారు వెనక్కు వచ్చారని తెలుస్తోంది. కాగా, ఓ నిర్మాతకు గతంలో ఇచ్చిన చెక్కు బౌన్సు కావడంతో జీవితకు రెండేళ్ల జైలుశిక్ష, రూ.25 లక్షల జరిమానాను ఎర్రమంజిల్ కోర్టు విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News