: మంగళగిరిలో ఏపీ రాజధాని ప్రధాన రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయలేం: జీఎం శ్రీవాస్తవ


ఏపీ నూతన రాజధానికి సంబంధించిన ప్రధాన రైల్వే స్టేషన్ ను మంగళగిరిలో ఏర్పాటు చేయడం సాధ్యంకాదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. మంగళగిరి రైల్వే స్టేషన్ ను సందర్శించిన అనంతరం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ ను ప్రధాన టెర్మినల్ గా అభివృద్ధి చేసేందుకు అవసరమైన స్థలం అందుబాటులో లేదని చెప్పారు. విజయవాడ, గుంటూరు రైల్వేస్టేషన్లలో ఏదో ఒకదాన్ని రాజధాని ప్రాంత ప్రధాన రైల్వే టెర్మినల్ గా రూపొందిస్తామని వివరించారు. ఈ రెండు స్టేషన్లతో పాటు వీటి మధ్యలో ఉన్న అనేక స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News